Saturday, November 22, 2014

Telugu Greatness Songs - 2

తెలుగువారి గొప్పతనం తెలిపే పాటలు


Paadanaa Tenugu Paata 


Film: America Ammayi
Director: Sigeetham Srinivasa Rao
Music: G.K. Venkatesh
Lyrics: Devulapalli Krishnashastri
Singer: Susheela
Actors: Chammoti Anne Koriya (Rename : Devayani ), Sridhar
Film Released on : 19-11-1976





పాడనా తెనుగు పాట... పరవశనై ......
నే పరవశనై మీ యెదుట మీ పాట 
పాడనా తెనుగు పాట

కోవెల గంటల గణగణలో - గోదావరి తరగల గలగలలో 
కోవెల గంటల గణగణలో - గోదావరి తరగల గలగలలో
మావుల తోపుల మూపులపైన 
మసలే గాలుల గుసుగుసలో
మంచి ముత్యాల పేట - మధురామృతాల తేట... 
ఒకపాట 
పాడనా తెనుగు పాట... పరవశనై ......
నే పరవశనై మీ యెదుట మీ పాట 
పాడనా తెనుగు పాట

త్యాగయ క్షేత్రయ రామదాసులు - త్యాగయ క్షేత్రయ రామదాసులు 
తనివితీర వినిపించినదీ 
నాడునాడులా కదలించేదీ - వాడవాడలా కరిగించెదీ 
చక్కరమాటల మూట
చిక్కని తేనెల ఊట...
ఒకపాట 
పాడనా తెనుగు పాట

ఒళ్ళంత ఒయ్యారి కోక - కళ్ళకు కాటుక రేఖ 
ఒళ్ళంత ఒయ్యారి కోక - కళ్ళకు కాటుక రేఖ 
మెళ్ళో తాళీ  - కాళ్ళకు పారాణి - మెరిసే కుంకుమ బొట్టు 
ఘల్లు ఘల్లున కడియాలందెలు - అల్లనల్లన నడయాడే 
తెనుగుతల్లి పెట్టనికోట - తెనుగునాట ప్రతినోట 
పాడనా తెనుగు పాట