ఛందస్సు
TELUGU CHANDASSU
తెలుగు రచన రెండు విధాలు కలవు:
1 . గద్యము
2 . పద్యము
గద్యానికి
చందోనియమము లేదు. పద్యము అనేది చందోనియమముతో కూడినది, ఈ ఛందస్సు పద
లక్షణములను తెలుపు శాస్త్రమును ఛందశ్శాస్త్రము అనబడును. పద్యము గణముల వలన
ఏర్పడును. ఈ గణములు గురు, లఘువులతో కూడి ఏర్పడును.
గురు, లఘువులు
గురువును 'గు' ( U ) అని, లఘువును 'ల' ( l ) అని గుర్తింతురు.
లఘువు అనగా నేమి?
లఘువు అనగా హ్రస్వము, అనగా పొట్టి అక్షరము, ఒక చిటికే వేయు కాలమున పలుకబడునది లఘువు.
ఉదా: అ, ఇ, ఉ, ఎ, ఋ, ఒ
గురువు అనగా నేమి?
గురువు అనగా దీర్ఘము, అనగా ఊది పలుకునవి, రెండు చిటికెల కాలమున పలుకబడునవి.
ఉదా: ఆ, ఈ, ఊ, ఏ, ఐ, ఓ, ఔ
ఇంకనూ అనుస్వరము అనగా సున్నా (o), విసర్గల (:) తో కూడుకొన్న లఘువు కూడా గురువగును.
ఉదా: అం, అః , కం , కః
పోల్లులతో కూడుకున్న లఘువు కూడా గురువగును.
ఉదా: అన్, నిన్, నున్, మన్
ద్విత్వాక్షరములకు (ఒక అక్షరమునకు అదే వత్తు కలియునవి) ముందున్న లఘువు గురువగును.
ఉదా: అక్క, అన్న, అమ్మ, అవ్వ
(ఇక్కడ క్క, న్న, మ్మ, వ్వ అనునవి ద్విత్వములు వాటి ముందున్న అ అక్షరములు గురువులగును)
సంయుక్తాక్షరములకు (ఒక అక్షరమునకు వేరొక వత్తు కలియునవి) ముందున్న లఘువు గురువగును.
ఉదా: కర్త, కర్మ, కన్య, భర్త,
గణములు
గణములు సమగణములు, ఉప గణములు అని రెండు విధాలు కలవు.
1. సమగణములు:
సమగణములను ప్రధాన గణములని అందురు, అవి ఎనిమిది కలవు.
Sl గణములు గుర్తు ఉదాహరణ లక్షణము
1. మగణము UUU ఖట్వాంగీ మూడు గురువులు
2 భగణము U11 ఈశ్వర ఆది గురువు
3 జగణము 1U1 మహేశ మద్య గురువు
4 సగణము 11U శరభా అంత్యగురువు
5 నగణము 111 హరుడు మూడు లఘువులు
6 యగణము 1UU పిణాకీ ఆది లఘువు
7 రగణము U1U శంకరా మద్య లఘువు
8 తగణము UU1 కైలాస అంత్య లఘువు
ఇంకనూ క్రిందివి కూడా గణములుగా పిలువబడును :
నగము 111U నగణము పైన గురువు
నలము 1111 హరహర నగణము పైన లఘువు
సలము 11U1 నటరాజ సగణము పైన లఘువు
2 .ఉప గణములు:
ఉప గణముల రెండుగా విభాజించెదరు. అవి 1 సూర్యగణములు, 2 ఇంద్రగణములు.
1 సూర్యగణములు 2:
1 నగణము 111
2 హగణము U1
2 ఇంద్ర గణములు 6 :
1 నలము 1111
2 నగము 111U
3 సలము 11U1
4 భగణము U11
5 రగణము U1U
6 తగణము UU1
వగణము 1U లఘువు మీద గురువు (దీనిని లగము అనీ అందురు) కూడా ఇందులోనే చేరును.
పద్య రచనలో యతి, ప్రాస ఉండ గలవు.
యతి:
యతి అనగా వర్ణ మైత్రి. అనగా పాదమున మొదటి అక్షరము యతి. నిర్దేశించబడిన గణాద్యక్షరము తో మైత్రి గల అక్షరము కూర్చవలెను.
యతి మైత్రి అక్షరములు:
ఈ క్రింది హల్లులకు మాత్రమే యతి చెల్లును. హల్లులతో బాటు అచ్చులకు గూడ మైత్రి ఉండవలెను.
అ,ఆ,ఐ,ఔ,య,హ
ఎ,ఈ,ఎ,ఏ,ఋ,రూ, రి, రీ, రె, రే
ఉ, ఊ, ఒ, ఓ
క,ఖ,గ,ఘ
చ, చ్చ, జ, ఝ, శ, ష , స
ట, ఠ, డ, ఢ
ట, ఠ, డ, ఢ
త, థ, ద, ధ
ప, ఫ, బ, భ, వ
న , ణ
ల, ళ
పు, ఫు, ఫూ, బు, బూ, భు, భూ
ము, మూ, మొ, మో
వొ, వో, వు, వూ
ప్రాస:
పాదమున రెండవ అక్షరము ప్రాస అగును. ప్రాసలో హల్లు మైత్రి ఉండిన సరిపోవును.
కొన్ని ప్రాస మైత్రి అక్షరములు:
ద, ధ,
త, థ
న, ణ
ల, ళ
( (అరసున్న) 0 (సున్న) [ (, 0 లను ఖండాఖండ ప్రాస అందురు]
ప, ఫ, బ, భ, వ
న , ణ
ల, ళ
పు, ఫు, ఫూ, బు, బూ, భు, భూ
ము, మూ, మొ, మో
వొ, వో, వు, వూ
ప్రాస:
పాదమున రెండవ అక్షరము ప్రాస అగును. ప్రాసలో హల్లు మైత్రి ఉండిన సరిపోవును.
కొన్ని ప్రాస మైత్రి అక్షరములు:
ద, ధ,
త, థ
న, ణ
ల, ళ
( (అరసున్న) 0 (సున్న) [ (, 0 లను ఖండాఖండ ప్రాస అందురు]
పద్యములు - లక్షణములు
పద్యములు జాతులు, ఉపజాతులు, వృత్తములు అని 3 రకాలు కలవు.
1. జాతులు
జాతులు 2 కలవు, 1. కందము, 2. ద్విపద
1. కందము:
కందానికి 4 పాదములుండును. 1, 3 పాదములందు - 3 గణములు మరియు 2, 4 పాదములందు - 5 గణములు ఉండును.
ప్రతి గణము నందు 4 మాత్రలుండును. అవి గగ, భ,జ,స,నల గణములుండును.
బేసి గణములలో జగణము ఉండరాదు.
6 వ గణములో నలము గాని, జగణము గాని ఉండవలెను.
2, 4 పాదముల చివర గురువుండవలెను.
గురువుతో పద్యము నారంభించినచో మిగిలిన 3 పాదములను కూడా గురువుతోనే మొదలిడాలి.
ప్రాస నియమము ఉండును.
4 వ గణము యొక్క మొదటి అక్షరం - 7 వ గణము యొక్క మొదటి అక్షరముతో యతి గూర్చవలెను.
ఉదాహరణ:
కొందఱు నందుని మెత్తురు
Ull Ull Ull
భ భ భ
కొందర తడెపర మాత్మని గొల్తురు యింకన్
Ull llll Ull Ull UU
భ నల భ భ గగ (యతి: కొ-గొ)
కొందర కతనే సర్వము
Ull llU Ull
భ స భ
నందుడి టులపూ జితుడ య్యె నఖిల భువిచే
Ull llU llU llll llU
భ స స నల స
2. ద్విపద:
ద్విపదలో కేవలము 2 పాదములు మాత్రమే ఉండును.
ప్రతి పాదమునకు వరుసగా 3 ఇంద్ర గణములు, 1 సూర్య గణములు ఉందును.
ప్రాస నియమము కలదు (ప్రాస లేకుండా కూడా ద్విపదలుండును, వాటిని మంజరీ ద్విపద అందురు)
1 వ గణాద్యక్షరమునకు 3 వ గణాద్యక్షరముచే యతి ఉండును.
2. ఉపజాతులు:
ఉపజాతులు 3 కలవు, 1.ఆటవెలది, 2. తేటగీతి, 3. సీసము
ఉపజాతులకు ప్రాస నియమముండదు, ప్రాస యతి వేయవచ్చును.
1. ఆటవెలది:
1,3 పాదములందు వరుసగా 3 సూర్య గణములు, 2 ఇంద్ర గణములు ఉండును.
2,4 పాదములందు 5 సూర్య గణములు ఉండును.
1 వ గణాద్యక్షరమునకు 4 వ గణాద్యక్షరముచే యతి ఉండును.
ఉదాహరణ:
దీక్ష చిత్ర మందు ధీరుడౌ రాముండు
Ul Ul U1 U1U UU1
హ హ హ ర త (యతి: దీ-ధీ)
ధరణి రాతి నెత్త దాక బోవ
lll Ul Ul Ul Ul
న హ హ హ హ (యతి: ధ-దా)
నాతి క్రింద నుగల నాగన్న గాటేసె
Ul Ul lll UUl UUl
హ హ న త త (యతి: నా-నా)
ముంజె చేతి పైన మూడు మార్లు
Ul Ul Ul Ul Ul
హ హ హ హ హ (యతి: ము-మూ)
2. తేటగీతి:
ప్రతి పాదములో వరుసగా 1 సూర్య గణము , 2 ఇంద్ర గణములు, 2 సూర్య గణములు ఉండును.
1 వ గణాద్యక్షరమునకు 4 వ గణాద్యక్షరముచే యతి కుదుర్చవలె.
ఉదాహరణ:
దివిని దేవత లందరు దీవె నలను
lll Ull Ull Ul lll
న భ భ హ న (యతి: ది-దీ)
ఇవ్వ పిల్లగా లులై ఇలను దిగిరి
Ul UlU lU lll lll
హ ర వ న న (యతి: ఇ-ఇ)
కలియు గవెంక న్నకొండ కదలి వచ్చె
lll lUU lUl lll Ul
న య జ న హ (యతి: క-క)
దివ్య భ్రమరమై యాశీర్వ దించ నెంచి
Ul lllU UUl Ul Ul
హ నగ త హ హ (యతి: ది-ది)
3. సీసము:
ప్రతి పాదములో వరుసగా 6 ఇంద్ర గణములు, 2 సూర్య గణములు ఉండును.
4 పాదముల చివర ఆటవెలది లేదా తేటగీతి కాని ఉండవలెను, అప్పుడే సీసము పూర్తగును.
2 యతులుండును - 1వ గణాద్యక్షరమునకు 3 వ గణాద్యక్షరముచే ఒక యతి, 5 వ గణాద్యక్షరమునకు 7 వ గణాద్యక్షరముచే రెండవ యతి.
ఉదాహరణ:
కామ్యార్థ సిద్ధులన్ కాంక్షించి వాంచించి చలరేగి తెలుగుదే శమ్ము వారు
UUl U1U UU1 UU1 llUl lllU Ul Ul
త ర త త సల నగ హ హ (యతి: కా-కా, చ-శ)
మితిమీరి గతిదప్పి మిడిసిపా టునుపడి పరపార్టి వారల పజ్జ జేరి
llUl llUl lllU llll llUl Ull Ul Ul
సల సల నగ నల సల భ హ హ (యతి: మి-మి, ప-ప)
నిలబడి రిఎ న్నికలసం గ్రామాన గళమిప్పి సరికొత్త కథల తోడ
llll lU lllU UUl llUl llUl lll Ul
నల లగ నగ త సల సల న హ (యతి: ని-న్ని, గ-క)
నందమూ రంతటి నాయకా గ్రజునితో చెలిమిమి త్రత్వమున్ జేసి యుండి
UlU Ull UlU lllU lllU UlU Ul Ul
ర భ ర నగ నగ ర హ హ (యతి: న-నా, చె-జే)
తేటగీతి:
నతని నెదురొడ్డి నిలవంగ నదిరి బెదిరి
lll llUl llUl lll lll
న సల సల న న (యతి: న-న)
మాటు గనుపొంచి కుత్సిత మాయ బన్ని
Ul llUl Ull Ul Ul
హ సల భ హ హ (యతి: మా-మా
కుటిల రాజనీ తులతోడ కూల ద్రోయ
lll UlU llUl Ul Ul
న ర సల హ హ (యతి: కు-కూ)
పథక ములవేసి ఓడించి పదవి మనిరి
lll llUl UUl lll lll
న సల త న న (యతి: ప-ప)
3. వృత్తములు:
వృత్తములు చాలా కలవు, అందులో కొన్ని ముఖ్యమైన వాటిని ఇక్కడ వివరింతును.
వృత్తములు సమ ప్రధాన గణములచే ఏర్పడును.
ప్రాసనియమము ఉండును.
1. శార్దూలము:
ప్రతి పాదములో వరుసగా మ, స,జ,స,త, త, గ అను గణములు ఉండును.
1వ అక్షరముచే 13వ అక్షరమునకు యతి.
చాలీచా లనిఅ ద్దెఇంటి నబడే సంకాట ముల్ దీర్చు కో
UUU llU lU1 llU UUl UUl U
మ స జ స త త గ (యతి: చా - సం)
తల్లిదం డ్రులసం ప్రదించి యునునం దాఖ్యుండు చెన్నాపు రిన్
UUU llU lU1 llU UUl UUl U
మ స జ స త త గ (యతి: త - దా)
ఇల్లున్ గ ట్టుటకా నికూడ దనియో చించీనొ కన్ కట్టి యు
UUU llU lU1 llU UUl UUl U
మ స జ స త త గ (యతి: ఇ - చిం)
న్నిల్లున్ దీ సుకఆ లుబిడ్డ లతొనుం డెన్ ఇంద్ర భోగంబు నన్
2. తేటగీతి:
ప్రతి పాదములో వరుసగా 1 సూర్య గణము , 2 ఇంద్ర గణములు, 2 సూర్య గణములు ఉండును.
1 వ గణాద్యక్షరమునకు 4 వ గణాద్యక్షరముచే యతి కుదుర్చవలె.
ఉదాహరణ:
దివిని దేవత లందరు దీవె నలను
lll Ull Ull Ul lll
న భ భ హ న (యతి: ది-దీ)
ఇవ్వ పిల్లగా లులై ఇలను దిగిరి
Ul UlU lU lll lll
హ ర వ న న (యతి: ఇ-ఇ)
కలియు గవెంక న్నకొండ కదలి వచ్చె
lll lUU lUl lll Ul
న య జ న హ (యతి: క-క)
దివ్య భ్రమరమై యాశీర్వ దించ నెంచి
Ul lllU UUl Ul Ul
హ నగ త హ హ (యతి: ది-ది)
3. సీసము:
ప్రతి పాదములో వరుసగా 6 ఇంద్ర గణములు, 2 సూర్య గణములు ఉండును.
4 పాదముల చివర ఆటవెలది లేదా తేటగీతి కాని ఉండవలెను, అప్పుడే సీసము పూర్తగును.
2 యతులుండును - 1వ గణాద్యక్షరమునకు 3 వ గణాద్యక్షరముచే ఒక యతి, 5 వ గణాద్యక్షరమునకు 7 వ గణాద్యక్షరముచే రెండవ యతి.
ఉదాహరణ:
కామ్యార్థ సిద్ధులన్ కాంక్షించి వాంచించి చలరేగి తెలుగుదే శమ్ము వారు
UUl U1U UU1 UU1 llUl lllU Ul Ul
త ర త త సల నగ హ హ (యతి: కా-కా, చ-శ)
మితిమీరి గతిదప్పి మిడిసిపా టునుపడి పరపార్టి వారల పజ్జ జేరి
llUl llUl lllU llll llUl Ull Ul Ul
సల సల నగ నల సల భ హ హ (యతి: మి-మి, ప-ప)
నిలబడి రిఎ న్నికలసం గ్రామాన గళమిప్పి సరికొత్త కథల తోడ
llll lU lllU UUl llUl llUl lll Ul
నల లగ నగ త సల సల న హ (యతి: ని-న్ని, గ-క)
నందమూ రంతటి నాయకా గ్రజునితో చెలిమిమి త్రత్వమున్ జేసి యుండి
UlU Ull UlU lllU lllU UlU Ul Ul
ర భ ర నగ నగ ర హ హ (యతి: న-నా, చె-జే)
తేటగీతి:
నతని నెదురొడ్డి నిలవంగ నదిరి బెదిరి
lll llUl llUl lll lll
న సల సల న న (యతి: న-న)
మాటు గనుపొంచి కుత్సిత మాయ బన్ని
Ul llUl Ull Ul Ul
హ సల భ హ హ (యతి: మా-మా
కుటిల రాజనీ తులతోడ కూల ద్రోయ
lll UlU llUl Ul Ul
న ర సల హ హ (యతి: కు-కూ)
పథక ములవేసి ఓడించి పదవి మనిరి
lll llUl UUl lll lll
న సల త న న (యతి: ప-ప)
3. వృత్తములు:
వృత్తములు చాలా కలవు, అందులో కొన్ని ముఖ్యమైన వాటిని ఇక్కడ వివరింతును.
వృత్తములు సమ ప్రధాన గణములచే ఏర్పడును.
ప్రాసనియమము ఉండును.
1. శార్దూలము:
ప్రతి పాదములో వరుసగా మ, స,జ,స,త, త, గ అను గణములు ఉండును.
1వ అక్షరముచే 13వ అక్షరమునకు యతి.
చాలీచా లనిఅ ద్దెఇంటి నబడే సంకాట ముల్ దీర్చు కో
UUU llU lU1 llU UUl UUl U
మ స జ స త త గ (యతి: చా - సం)
తల్లిదం డ్రులసం ప్రదించి యునునం దాఖ్యుండు చెన్నాపు రిన్
UUU llU lU1 llU UUl UUl U
మ స జ స త త గ (యతి: త - దా)
ఇల్లున్ గ ట్టుటకా నికూడ దనియో చించీనొ కన్ కట్టి యు
UUU llU lU1 llU UUl UUl U
మ స జ స త త గ (యతి: ఇ - చిం)
న్నిల్లున్ దీ సుకఆ లుబిడ్డ లతొనుం డెన్ ఇంద్ర భోగంబు నన్
UUU llU lU1 llU UUl UUl U
మ స జ స త త గ (యతి: న్ని - డె)
2. ఉత్పలమాల:
ప్రతి పాదములో వరుసగా భ,ర,న,భ,భ,ర,వ గణములు ఉండును.
1వ అక్షరముచే 10వ అక్షరమునకు యతి.
3. చంపకమాల:
ప్రతి పాదములో వరుసగా న,జ,భ,జ,జ,జ,ర గణములు ఉండును.
1వ అక్షరముచే 11వ అక్షరమునకు యతి.
ఉదాహరణ:
చదివె నునంద మూరిబ హుశాస్త్ర ములెల్ల నుభక్తి శ్రద్దచే
చదువు చునేయ సాగెను ప్రజావ ళిమన్న నలందు నాటకాల్
2. ఉత్పలమాల:
ప్రతి పాదములో వరుసగా భ,ర,న,భ,భ,ర,వ గణములు ఉండును.
1వ అక్షరముచే 10వ అక్షరమునకు యతి.
3. చంపకమాల:
ప్రతి పాదములో వరుసగా న,జ,భ,జ,జ,జ,ర గణములు ఉండును.
1వ అక్షరముచే 11వ అక్షరమునకు యతి.
ఉదాహరణ:
చదివె నునంద మూరిబ హుశాస్త్ర ములెల్ల నుభక్తి శ్రద్దచే
lll lUl Ull lUl 1U1 lUl UlU
న జ భ జ జ జ ర
చదివె నువాటి నందుగ లసార ముసాంగ ముబుర్ర కెక్కగా
lll lUl Ull lUl 1U1 lUl UlU
న జ భ జ జ జ ర
చదువు లనేర్చు చున్ మది నసంత సమున్ త గినంత బొందకన్
lll lUl Ull lUl 1U1 lUl UlU
న జ భ జ జ జ ర
lll lUl Ull lUl 1U1 lUl UlU
న జ భ జ జ జ ర
4. మత్తేభము:
ప్రతి పాదములో వరుసగా స,భ,ర,న,మ, య,వ అను గణములు ఉండును.
1వ అక్షరముచే 14వ అక్షరమునకు యతి.
5. మత్తకోకిల:
ప్రతి పాదములో వరుసగా ర,స,జ,జ,భ,ర అను గణములు ఉండును.
1వ అక్షరముచే 11వ అక్షరమునకు యతి.
ఉదాహరణ:
తోడుదొం గలుపి చ్చిపుల్ల యదెచ్చి యుండిన నష్టమున్
UlU I IU lUl lUl Ull UlU
UlU I IU lUl lUl Ull UlU
ర స జ జ భ ర (యతి: తో- దె)
పూడ్చబూ నియుదీ యనెంచె ను ప్రేక్ష కావళి గోరెడీ
UlU I IU lUl lUl Ull UlU
ర స జ జ భ ర (యతి: పూ-ప్రే)
పూడ్చబూ నియుదీ యనెంచె ను ప్రేక్ష కావళి గోరెడీ
UlU I IU lUl lUl Ull UlU
ర స జ జ భ ర (యతి: పూ-ప్రే)
దండిగన్ రణస న్నివేశ ముదెచ్చి మైమర పించియూ
UlU I IU lUl lUl Ull UlU
ర స జ జ భ ర (యతి: దం - దె)
UlU I IU lUl lUl Ull UlU
ర స జ జ భ ర (యతి: దం - దె)
వాడిమా టలువే డిపాట లువచ్చె డీజయ సింహనూ
UlU I IU lUl lUl Ull UlU
ర స జ జ భ ర (యతి: వా - వ)
UlU I IU lUl lUl Ull UlU
ర స జ జ భ ర (యతి: వా - వ)
టైపింగ్ చేసే సమయం లేక నేను రాసిపెట్టుకున్న నోట్స్ ని యధాతతంగా ఇక్కడ
ఉంచుతున్నాను.
పిక్చర్ పైన డబుల్ క్లిక్ చేస్తే పెద్దగా కాగలదు.
ఇవి నా బాల్యంలో రాసినవి - రాత కొంచెం అర్థం కాకపోవచ్చు, క్షమించ మనవి.
పిక్చర్ పైన డబుల్ క్లిక్ చేస్తే పెద్దగా కాగలదు.
ఇవి నా బాల్యంలో రాసినవి - రాత కొంచెం అర్థం కాకపోవచ్చు, క్షమించ మనవి.
No comments:
Post a Comment