Telugu Saametalu - తెలుగు సామెతలు
సొమ్మొకడిది - సోకొకడిది
రెంటికి చెడ్డ రేవడి
అన్ని దానాలకన్నా అన్నదానం గొప్పది
తిండికి తిమ్మరాజు - పనికి పోతురాజు
తిండికి పిడుగు - పనికి బడుగు
తింటే కాని రుచి తెలియదు - దిగితే కాని లోతు తెలియదు
తినగ తినగ వేప తియ్యనుండు
క్షణం తీరిక లేదు - దమ్మిడి ఆదా లేదు
గొర్రెను తినేవాడు పొతే - బర్రెను తినేవాడు వచ్చినట్టు
ఎందుకు ఏడుస్తావురా పిల్లవాడా అంటే - ఎల్లుండి మా అమ్మ కొడుతుంది అన్నాడట
చూడబోయిన తీర్థం ఎదురుగా వచ్చినట్లు
దేవుని పెళ్ళికి అందరూ పెద్దలే
దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుతగిలినట్లు
హనుమంతునికి కుప్పిగంతులు నేర్పినట్లు
ఆకలి రుచి ఎరుగదు - నిద్ర సుఖం ఎరుగదు
గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఎరినట్లు
కడుపు నిండిన వాడికి గారెలు చేదు
బాల వాక్కు - బ్రహ్మ వాక్కు
బాలుర దీవెనలు - బ్రహ్మ దీవెనలు
ఉట్టికెక్క లేనమ్మ - స్వర్గానికి ఎగిరినట్లు
చేటు కాలానికి చెడ్డ బుద్దులు
గుడిని మింగేవాడొకడయితే - గుడి లింగాన్నే మింగే వాడింకొకడు
అరచేతిలో వైకుంటం చూపినట్లు
జన్మానికో శివరాత్రి
అమ్మబోతే అడవి - కొనబోతే కొరివి
పులి కడుపున పిల్లి పుడుతుందా?
అంత్య నిష్ఠూరం కంటే - ఆది నిష్ఠూరం మేలు
కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడు
గొర్రెపిల్లను చంకలో పెట్టుకుని ఊరంతా వెదకినట్లు
ఉయ్యాలలో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికినట్లు
తల్లిపాలు తాగి - తల్లిరొమ్ము గ్రుద్ది నట్లు
తలచుకొన్నప్పుడే తాతకు పెళ్లి
అడుక్కు తినే వాడికి అక్షంతలిస్తే - అమాంతం నోట్లో వేసుకున్నట్లు
అయ్యవారోచ్చే దాక అమావాస్య ఆగుతుందా?
ఆవు చేలో మేస్తే - దూడ గట్టున మేస్తుందా?
దెబ్బకు - దెయ్యం దిగివస్తుంది
శుభం పలకరా మంకెన్నా అంటే - పెళ్లికూతురు ముండ ఏది అన్నాడట
అందరూ మాటలు చెప్పేవారే కాని - పూటకు బత్తెం ఇచ్చే వాళ్ళు లేరు
ఆడింది ఆట - పాడింది పాట
అనుభవం ఒకరిది - ఆర్భాటం ఇంకొకరిది
ఆదిలోనే హంస పాదు
ఆరునెలలు సామునేర్చి - మూలనున్న ముసలమ్మను కొట్టినట్లు
ఎండాకురాలితే - పండాకు వెక్కిరించినట్లు
తల్లికి కూడు పెట్టలేనివాడు - పినతల్లికి గాజులు చేయించినట్లు
చేతకానమ్మకు చేష్టలు మెండు - చెల్లని రూకకు గీతలు మెండు
మంత్రాలకు చింతకాయలు రాలవు
అగ్నిలో ఆజ్యం పోసినట్లు
తనకు మాలిన ధర్మం - మొదలు చెడ్డ బేరం
ఊహ ఊళ్లెలమంటే - రాత రాళ్ళు మోయమంది
కీడెంచి మేలెంచాలి
వసుదేవుడంతటి వాడు గాడిద కాళ్ళు పట్టుకొన్నాడట
గోరంతలు కొండత చేయటం
శంఖంలో పోస్తేనే కాని తీర్థం కాదన్నట్లు
కరువులో అధికమాసం
కాకిపిల్ల - కాకికి ముద్దు
కలిపి కొట్టరా కావేటి రంగా
కథకు కాళ్ళు లేవు - ముంతకు చెవులు లేవు
కలుపు తీయని మడి - దేవుడు లేని గుడి
కన్నూ మనదే - వేలూ మనదే
కాకి ముక్కున దొండపండులా
చాదస్తపుమొగుడు - చెబితే వినడు, గిల్లితే ఏడుస్తాడు
చెప్పేవాడికి చేసేవాడు లోకువ
తనదాకా వస్తేనే కాని, తలనొప్పి బాధ తెలియదు
పిండికొద్దీ రొట్టె
మతిలేని మాట - శ్రుతిలేని పాట
తా పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు
తడిగుడ్డలతో గొంతు కోసినట్లు
తలలు బోడులైన - తలలు బోడులా?
తల్లిని నమ్మినవాడు - భూమిని నమ్మిన వాడు చెడడు
తప్పులెన్ను వారు - తమతప్పు లెరుగరు
తానూ తవ్వుకున్న గోతిలో, తానె పడతాడు
తాదూర సందులేదు - మెడకొక డోలు
తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదురునా?
తానొకటి తలిస్తే - దైవ మింకొకటి తలచినట్లు
తెలివి తక్కువ - ఆకలి ఎక్కువ
తోక తెగిన నక్కవోలె
తోక కాలిన పిల్లి వోలె
తాడు చాలదని - బావి పూడ్చు కుంటారా?
సూర్యుని ముందు దివిటీ పట్టినట్లు
నక్క ఎక్కడ - నాగలోక మెక్కడ?
దీపముండగా ఇల్లు చక్క బెట్టుకోవాలి
దూరపు కొండలు నునుపు
దొంగచేతికి తాళ మిచ్చినట్లు
నోరు ఉన్నవాడిదే రాజ్యం
నా నోట్లో వేలు పెట్టు - నీ కంట్లో వేలు పెడతానన్నట్లు
పరుగెత్తి పాలు తాగే కన్నా - నిలబడి నీళ్ళు తాగడం మేలు
పిట్ట పోరు పిట్టపోరు - పిల్లి తీర్చినట్లు
పెద్దల మాట - చద్ది మూట
పువ్వు పుట్టగానే - పరిమళిస్తుంది
ప్రజలమాటే - ప్రభువు కోట
ప్రీతితో పెట్టింది పిడికెడైన చాలు
ఏటి ఈతకు - లంక మేతకు సరి
బంగారముంటే - సింగారనికేమి తక్కువ
బజారు బత్తెం - బావి నీళ్ళు
సత్రం భోజనం - మఠం నిద్ర
భయమైనా ఉండాలి - భక్తైనా ఉండాలి
మనసుంటే - మార్గముంటుంది
మనుషులు పోయినా - మాటలు నిలుస్తాయి
పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చనే
కాకులను కొట్టి గద్దలకు వేసినట్లు
కూడు ఉంటె గులగోత్రాలేందుకు
కాసిన చెట్లకే కర్ర దెబ్బలు
కాలికేస్తే మెడకు - మెడకేస్తే కాలికి
కాలు జారితే తీసుకోగలం కాని నోరు జారితే తీసుకోలేం
కింద పడ్డా నాదే పైచేయి అన్నట్లు
కుండలో కూడు కుండలోనే ఉండాలి - బిడ్డలు మాత్రం దుడ్దేల్లా పెరగాలి
కోటి విద్యలు - కూటి కొరకే
కూచుని తింటూ ఉంటే - కొండలైనా కరిగిపోతాయి
కొత్త బిచ్చగాడు పొద్దెరుగడు
కొండంత దేవుడికి గోరంత దీపం
కోతిపుండు బ్రహ్మ రాక్షసికి
కొండ నాలుకకు మందువేస్తే - ఉన్న నాలుక ఊడిపోయిందట
గంజాయివనంలో తులసి మొక్క లాగ
గాలిలో దీపం పెట్టి - దేవుడా నీదే మహిమ అన్నట్లు
గంతకు తగిన బొంత
గారాభం గజ్జల కేడిస్తే - వీపు దెబ్బల కేడ్చిందట
గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించినట్లు
గుఱ్ఱము గుడ్డిదైనా - దాణాకు తక్కువ లేదు
గోరుచుట్టపై రోకలిపోటు
నిండా మునిగిన వాడికి చలేమి?
చదవక ముందు కాకరకాయ - చదివిన పిమ్మట కీకరకాయ
చినికి చినికి గాలివాన అయినట్లు
చెప్పెడు మాటలు చేటు
చెప్పడం తేలిక - చేయటం కష్టం
చెప్పడం కంటే - చేయటం మేలు
చింత చచ్చినా పులుపు చావదు
No comments:
Post a Comment