Friday, June 28, 2013

Telugu Samethalu - 2


Telugu Saamethalu - తెలుగు సామెతలు 


మట్టిలో మాణిక్యం అన్నట్లు 
మసిపూసి మారేడు కాయ చేసినట్లు 
మాటకు పడిచస్తాము కాని - మూటకు పడిచస్తామా?
మానవ సేవయే - మాధవ సేవ  
మింగ మెతుకు లేదు - మీసాలకు సంపెంగ నూనె
మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు
మీనా మేషాలు లెక్క పెట్టినట్లు
ముందు వచ్చిన చెవులకంటే - వెనకొచ్చిన కొమ్ములు వాడి

కీలెరిగి వాత పెట్టాలి
మొరిగే కుక్క కరవదు
ఎరుక పిడికెడు ధనం 
యదార్థ వాది - లోక విరోధి
ఉన్నంత అనరాదు - ఉళ్ళో ఉండరాదు
యథా రాజా - తథా ప్రజా 
వత్తులు చెయ్యాలంటే ప్రత్తి కావాలి
వరదలు వస్తాయని వర్షాలు ఆగవు
వాపు మానును గాని - వాతలు మానునా?
విగ్రహపుష్టి - నైవేద్య నష్టి 
వెదకపోయిన తీగ కాలికి తగిలినట్లు 
వెర్రి వేయి విధాలు - పైత్యం పదివేలు  

కాంచే చేను మేస్తే కాచే వారెవరు
శల్య సారథ్యం
రక్షించిన వాణ్ని భక్షించి నట్లు
రాజ్యము - వీర భోజ్యము
రాను రాను గుర్రం గాడిదయినట్లు
రావణాసురిడి కాష్టంలాగా
రెండు పడవల్లో కాళ్ళు పెట్టినట్లు
రెండు చేతులు కలిస్తేనే చప్పుడయేది
రెండు వ్రేళ్ళతో నాటవచ్చును కానీ - అయిదు వ్రేళ్ళతో పీక కూడదు
రేపు అనే మాటకు రూపం లేదు
రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు
రొయ్యకూ లేదా బారెడు మీసం!
రైతు బీద కాని - చేను బీద కాదు
రోగి కోరింది పాలే - వైద్యుడు చెప్పింది పాలే
రౌతు కొద్ది గుఱ్ఱము
రౌతు మెత్తనయితే - గుర్రం మూడు కాళ్ళతో నడుస్తుంది

విత్తు మంచిదేస్తే - మొక్క మంచిది మొలుస్తుంది
విత్తనము కొద్దీ మొక్క 
విత్తు ముందా ? చెట్టు ముందా ?
తంతే బూరెల బుట్టలో పడ్డట్లు 
పిల్లి కడుపునా పులి పుడుతుందా?
లేడికి లేచిందే ప్రయాణం
కృషితో నాస్తి దుర్భిక్షం 
మూడు పువ్వులు - ఆరు కాయలు
కందిచేలో ఉంగరం పారేసుకుని - పప్పుకుండలో వెతికినట్లు
కాకిలా కలకాలం బ్రతికే కంటే - హంసలా ఆరు మాసాలు బ్రతకడం మేలు 
లోగుట్టు పెరుమాళ్ళ కెరుక
వజ్రానికి సాన - బుద్దికి చదువు 
వేడి నీళ్ళకు చన్నీళ్ళు - చన్నీళ్ళకు వేడినీళ్ళు తోడయినట్లు
వ్రతం చెడ్డా - సుఖం దక్కాలి
వానలుంటే పంటలు - లేకుంటే మంటలు

శుష్క ప్రియాలు - శూన్య హస్తాలు
శృతిమించ రాగాన పడినట్లు
సంతోషమే సగం బలం
ఆపద మొక్కులు - సంపద మరపులు
స్వాతివానకు - ముత్యపుచిప్ప లాగ
చేతులు కాలిన తరువాత - ఆకులు పట్టుకుంటే లాభమేమి
ముందు నుయ్యి - వెనక గొయ్యి
పండుకున్న వారికి పరుపు వేస్తారు - ఎగిరేవారికి రెక్కలు కట్టేస్తారు
తాచెడ్డ కోతి - వనమెల్లా చెరచినట్లు
యద్భావం తత్బవతి

వచ్చిన పేరు - చచ్చినా పోదు
వాన రాకడ - ప్రాణం పోకడ తెలియదు
వచ్చేటపుడు తీసుకు రారు - పోయేటపుడు తీసుకు పోరు
శ్వాస ఉండేవరకు ఆశ ఉంటుంది
ఎంత చేసినా కూటికే - ఎన్నాళ్ళు బ్రతికినా కాటికే
శాపాలకు చచ్చినవాడూ - దీవెనలకు బ్రతికినవాడూ  లేడు 
సర్వేజనా సుఖినోభవంతు

 



 

No comments:

Post a Comment