Friday, November 21, 2014

Telugu Greatness Songs - 1

తెలుగువారి గొప్పతనం తెలిపే పాటలు 

Naa paluke keertana...


Film: Radhakrishna
Actor: Jayapradha
Music: S.Rajeshwara Rao
Lyrics: Veturi Sundara Rama Murthy
Singer: P.Susheela
Director: K.Raghavendra Rao
Film Released in 1978





నా పలుకే కీర్తనా...  నా పలుకే కీర్తనా...  
కదలికలే నర్తనా.... నా పలుకే కీర్తనా...  
మురిపాలవెల్లి నా తెలుగుతల్లికి నేనే రూప కల్పనా 
నా పలుకే కీర్తనా...  

అలివేణి వాలుజడలో... క్రిష్ణవేణి ప్రవహించగా 
కలికి కడకొంగులో... వరద గోదారి పొంగగా - ఉప్పొంగగా 
నా అడుగే హంసల దీవిగా 
నా నడకే కిన్నెరసానిగా 
నా అడుగే హంసల దీవిగా 
నా నడకే కిన్నెరసానిగా 
తెలుగు మాగాణి పసిమితో జిలుగుచీర జీరాడగా 
నేనాడగా - పాడగా 
నా పలుకే కీర్తనా... 

మువ్వగోపాల పదములా - నా మువ్వలే ముద్దులాడగా  
మువ్వగోపాల పదములా - నా మువ్వలే ముద్దులాడగా  
కొత్త ఋతువులో ఎంకిపాటలే కోయిలమ్మ వినిపించగా 
మనసులన్ని కావ్యాలుగా
సొగసులన్ని శిల్పాలుగా 
మనసులన్ని కావ్యాలుగా
సొగసులన్ని శిల్పాలుగా 
వంపుసోపులే హంపి కళలుగా - అందాలు అజంతాలుగా
నేనాడగా - పాడగా 
నా పలుకే కీర్తనా... 

తెలుగువారి బంగారుకొండ మా ఏడుకొండలా వెంకన్నా 
కొలిచేవారిని కులమడగని మా శ్రీశైల మల్లన్నా 
శబరి గౌతమీ పొంగినచోట వెలసె భద్రగిరి రామన్నా 
కల్పవల్లి మా కన్నతల్లి కనకదుర్గమ్మ కరుణజూడగా 
నేనాడగా - పాడగా 
నా పలుకే కీర్తనా... 
కదలికలే నర్తనా.... నా పలుకే కీర్తనా...  
నా పలుకే కీర్తనా...  





No comments:

Post a Comment